ఆహా సబ్‌స్క్రైబర్స్‌కి గుడ్‌న్యూస్‌, సరికొత్త ఫిచర్స్‌తో ఆహా 2.0 | Icon Star Presents AHA 2 Point 0 Grand Event In Hyderabad Allu Arjun As Chief Guest | Sakshi
Sakshi News home page

AHA: ఆహా సబ్‌స్క్రైబర్స్‌కి గుడ్‌న్యూస్‌, ఐకాన్‌ స్టార్‌ సమర్పణలో ఆహా 2.0

Nov 2 2021 8:44 PM | Updated on Nov 2 2021 8:47 PM

Icon Star Presents AHA 2 Point 0 Grand Event In Hyderabad Allu Arjun As Chief Guest - Sakshi

ఒరిజినల్ తెలుగు కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ సంస్థ ‘ఆహా’. ఎప్పటికప్పుడు సరికొత్త షోలు.. కొత్త కొత్త సినిమాలతో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. సందర్భాన్ని బట్టి ప్రేక్షకులను ఆకట్టుకొనే పనిలో ప్రణాళికలు వేస్తూ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అదిరిపోయే టాక్ షో… ఇంట్రెస్టింగ్ గేమ్ షోలతో సాగిపోతోంది. ప్రారంభించిన అతి తక్కున సమయంలోనే ఇతర ఓటీటీ సంస్థలకు గట్టి పోటీనిస్తూ.. డిజిటల్ రంగంలో నెంబర్ వన్ దిశగా దూసుకుపోతుంది ఈ తెలుగు ఓటీటీ సంస్థ.

చదవండి: హీరో బాలకృష్ణకు సర్జరీ

తరచూ సరికొత్త ఫిచర్స్‌ అందిస్తూ రోజు రోజుకీ తమ సబ్ స్కైబర్స్ సంఖ్యను పెంచుకుంటూ పొతోంది ఆహా. ఇదిలా ఉంటే.. అతి తక్కువ సమయంలో ఇంతటీ క్రేజ్ సంపాదించుకున్న ఆహా… ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమర్పణలో ఆహా 2.0 అవతరించనుంది. దీపావళి పండుగ సందర్భంగా ఆహా యాప్‏ను 2.0గా అప్ గ్రేడ్ చేసి సరికొత్త ఫీచర్స్ అందించారు. ఈ రోజ ఉ (నవంబర్‌ 2) హైదరాబాద్‏లో ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్‌ పేరుతో ఆహా 2.0 అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హజరయ్యాడు.

చదవండి: పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున

ఈ నేప‌థ్యంలో ఆహా ప్ర‌మోట‌ర్స్ అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, రామ్ రావ్ జూప‌ల్లి ఆహాలో ప్ర‌సారం కాబోయే సూప‌ర్ హిట్ చిత్రాలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, ల‌క్ష్య‌, మంచిరోజులొచ్చాయి, డీజే టిల్లు, రొమాంటిక్‌, అనుభ‌వించు రాజా, పుష్ప‌క విమానం, గ‌ని వంటి ఫిక్ష‌న‌ల్‌, నాన్ ఫిక్ష‌న‌ల్ చిత్రాల‌తో పాటు ఆహా ఒరిజిన‌ల్స్ అన్‌స్టాప‌బుల్‌, సేనాప‌తి, భామా క‌లాపం, త్రీరోజెస్ వంటి చిత్రాల‌కు సంబంధించి కూడా వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు. ఇప్పుడు ఆహాను స‌బ్‌స్క్రైబ్ చేసుకుని ఎవ‌రైతే ఎంజాయ్ చేస్తున్నారో ఆ వీక్ష‌కుల‌కు ఆహా 2.0 ద్వారా ఆడియో ప‌రంగా, పిక్చ‌ర్ క్వాలిటీ పరంగా వ‌ర‌ల్డ్ క్లాస్ ఫీచ‌ర్స్‌తో పాటు ఎలాంటి కంటెంట్ ప్రేక్ష‌కుడికి కావాల‌నే దానిపై కూడా ఈ యాప్ ద్వారా అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement