సినిమాటోగ్రాఫర్‌ రసూల్‌ భార్య ఎవరో తెలుసా? ఆ టాలీవుడ్‌ నటి.. | Cinematographer Rasool Ellore about His Love Story | Sakshi
Sakshi News home page

Rasool Ellore: నటితో లవ్‌ మ్యారేజ్‌.. పెళ్లయ్యాక సినిమాలు ఎందుకు మానేసిందంటే?

Jun 27 2025 11:09 AM | Updated on Jun 27 2025 8:54 PM

Cinematographer Rasool Ellore about His Love Story

గాయం, చిత్రం, నువ్వునేను, గులాబీ, కిక్‌.. ఇలా ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు రసూల్‌ ఎల్లోర్‌. ఒకరికి ఒకరు, సంగమం, భగీరథ చిత్రాలను డైరెక్ట్‌ కూడా చేశారు. సినిమాల్లో పని చేస్తున్న సమయంలోనే నటి జాహ్నవితో పరిచయం ప్రేమగా మారడంతో ఆమెను పెళ్లి చేసుకున్నారు. జాహ్నవి.. యజ్ఞం, హ్యాపీ చిత్రాల్లో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా నటించారు.

అల్లు అర్జున్‌ హ్యాపీ మూవీలో జాహ్నవి

సినిమా సెట్‌లో పరిచయం..
ఆమె సినిమాలు మానేయడం గురించి సినిమాటోగ్రాఫర్‌ రసూల్‌ స్పందించాడు. ఒకరికి ఒకరు సినిమా సెట్‌లో మేమిద్దరం కలిశాం. అలా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత తను సినిమాలు మానేసింది. అందుకు ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేవు. మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాకే తను సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కానీ తను తల్చుకుంటే మంచి దర్శకురాలు కాగలదు అని చెప్పారు. రసూల్‌ సినిమాటోగ్రాఫర్‌గా.. ఫ్యామిలీ సర్కస్‌, లిటిల్‌ సోల్జర్స్‌, వాంటెడ్‌, జల్సా, ఊసరవెల్లి, ఏజెంట్‌, దేవకీ నందన వాసుదేవ.. ఇలా ఎన్నో చిత్రాలు చేశారు.

యజ్ఞం సినిమాలో నటి జాహ్నవి

చదవండి: స్టార్‌ సింగర్‌ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే?

Advertisement
 
Advertisement
Advertisement