BB Telugu OTT: Who Is Hosting For Bigg Boss 6 Telugu Show - Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna: బిగ్‌బాస్‌ హోస్ట్‌గా బాలయ్య? సైడ్‌ అయిన నాగార్జున!

Dec 23 2021 4:20 PM | Updated on Dec 23 2021 5:03 PM

BB Telugu OTT: Who Is Hosting For Bigg Boss 6 Telugu Show - Sakshi

ప్రతిసారి అయ్యో బిగ్‌బాస్‌ అయిపోయిందే అనుకునేవారు జనాలు. కానీ ఈసారి మాత్రం హమ్మయ్య బిగ్‌బాస్‌ అయిపోయింద్రా బాబూ అని ఊపిరి పీల్చుకుంటున్నారు. అంటే ఐదో సీజన్‌ ఏ రేంజ్‌లో అలరించిందో మీకీపాటికే అర్థమై ఉంటుంది. ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా మ్యాజిక్‌ చేయనప్పటికీ పర్వాలేదనిపించింది. ఆటపాటల కన్నా కొట్లాటలతోనే బాగా ఫేమస్‌ అయింది బిగ్‌బాస్‌ 5.

బిగ్‌బాస్‌ 5 గ్రాండ్‌ ఫినాలే రోజు నెక్స్ట్‌ సీజన్‌ గురించి హింటిచ్చాడు నాగార్జున. మరో రెండు నెలల్లో బిగ్‌బాస్‌ తర్వాతి సీజన్‌ రాబోతుందని ప్రకటించాడు. కానీ అది ఆరవ సీజనా? లేదా బిగ్‌బాస్‌ ఓటీటీ మొదటి సీజనా? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సోషల్‌ మీడియాలో మాత్రం అది ఓటీటీ సీజన్‌ అయ్యుంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దీనికి ఎవరు హోస్టింగ్‌ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్‌ తొలి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని, మూడు, నాలుగు, ఐదో సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆరో సీజన్‌కు మాత్రం నాగ్‌ను తప్పించి మరో స్టార్‌ హీరోను రంగంలోకి దింపుతున్నారట! 

ఆ స్టార్‌ హీరో మరెవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆహాలో అన్‌స్టాపబుల్‌ షోలో హోస్ట్‌గా రఫ్ఫాడిస్తున్నాడు బాలయ్య. దీంతో ఈ రియాలిటీ షోను బాలయ్యకు అప్పగిస్తే హోస్టింగ్‌, ఎంటర్‌టైనింగ్‌ వేరే లెవల్‌ ఉంటుందంటున్నారు నెటిజన్లు. కానీ నాగార్జునను కాదని బాలయ్యను వ్యాఖ్యాతగా తీసుకువచ్చే ఛాన్సే లేదన్న అభిప్రాయం కూడా ఉంది. ఒకవేళ నాగార్జున షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండి బిగ్‌బాస్‌ బాధ్యతను భుజానికెత్తుకోకపోతే మాత్రం బాలయ్యను రంగంలోకి దింపే అవకాశం లేకపోలేదు. బాలయ్య వస్తే మాత్రం షో తీరుతెన్నులే మారిపోవడం ఖాయం! మరి రెండు నెలల్లో ప్రారంభమయ్యే బిగ్‌బాస్‌ షో హోస్ట్‌ ఎవరన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement