ఓటీటీలోకి బాలయ్య ఎంట్రీ.. టాక్‌ షోతో రచ్చ రచ్చే

Bala Krishna To Do Talk Show For Aha OTT - Sakshi

ఇది ఒటీటీ కాలం. ఇప్పుడు కేవలం బిగ్ స్క్రీన్ కు మాత్రమే పరిమితం అవుతామంటే కుదరదు. అందుకే స్టార్స్ ఇటు స్మాల్ స్క్రీన్ పై, అటు ఓటీటీలోనూ కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.అన్ని స్క్రీన్ ను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే నాగార్జున , తారక్ బుల్లి తెరపై దుమ్మురేపుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో బాలయ్య పేరు చేరింది. 

ఎప్పుడూ సినిమాల గురించి మాత్రమే ఆలోచించే నందమూరి బాలకృష్ణ.. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఓటీటీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఆహా కోసం అన్ స్టాపబుల్ అనే టాక్ షో నిర్వహించబోతున్నారు నటసింహం.ఈ షోకు మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ అతిథిలుగా వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. గురువారం ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలను అల్లు అరవింద్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో చిరంజీవి, ఆయన కుమారు రామ్ చరణ్ పాల్గొంటారని, అలాగే ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పార్టిసిపేట్ చేశారని వినిపిస్తోంది. అలాగే నాగార్జున, ఆయన కుమారులతోనూ ఈ టాక్ షో ఉంటుందట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top