అంజలి ‘ఝాన్సీ’ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ చూశారా? | Anjali Starrer Jhansi Web Series Trailer Out Now | Sakshi
Sakshi News home page

Anjali : అంజలి ‘ఝాన్సీ’ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ చూశారా?

Oct 15 2022 3:16 PM | Updated on Oct 15 2022 3:31 PM

Anjali Starrer Jhansi Web Series Trailer Out Now - Sakshi

అందాల ముద్దుగుమ్మ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు, తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజలి తాజాగా ‘ఝాన్సీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. 'ఒక మనిషి జీవితంలో అన్నింటికంటే పెద్ద శిక్ష.. తనెవరో తనకే తెలియకపోవడం' అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభం అవుతుంది. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ సిరీస్‌ను తిరు డైరెక్ట్ చేస్తున్నాడు.

ట్రైబ‌ల్ హార్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై కృష్ణ నిర్మిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వేదికగా అక్టోబర్‌ 27న ఈ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. కాగా ఇటీవలె మాచర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో మెస్మరైజ్‌ అంజలి శంకర్‌-రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement