Atrangi Re Director Aanand L Rai Tests COVID-19 Positive | దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌కు కరోనా - Sakshi
Sakshi News home page

దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌కు కరోనా

Dec 31 2020 12:26 PM | Updated on Dec 31 2020 12:42 PM

Anand L Rai Tests Coronavirus Positive - Sakshi

ధనుష్‌, ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, సారా అలీఖాన్‌

బాలీవుడ్‌​ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన గురువారం నాడు ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. తనకు ఎలాంటి కోవిడ్‌ లక్షణాలు కనిపించడం లేదని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలిపారు. అధికారుల సూచన మేరకు క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. తనను కలిసినవారు కూడా క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కోరారు. ఆనంద్‌ రాయ్‌కు కరోనా రావడంతో ఆయన డైరెక్షన్‌ చేస్తున్న 'ఆత్రంగి రే' యూనిట్‌లో కలవరం మొదలైంది. (చదవండి: ధనుష్‌ చిత్రాలను రజనీ ఎందుకు నిరాకరించారు?)

ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్‌, అక్షయ్‌ కుమార్‌, సారా అలీ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ధనుష్‌ పాత్ర చిత్రీకరణ పూర్తి కావడంతో చిత్ర యూనిట్‌ నిన్న కేక్‌ కటింగ్‌ చేసింది. ఈ వేడుకలో దర్శకుడి వెంట ధనుష్‌, సారా అలీఖాన్ కూడా ఉండటంతో వారి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఆత్రంగి రే సినిమాలో ధనుష్‌ ఓ పాట కూడా పాడటం విశేషం. ‘3, కొడి, మారి, మారీ 2, పటాస్, తిక్క’ సినిమాల్లో పాటలు పాడారాయన. అయితే ఇప్పుడు తొలిసారి రెహమాన్‌ సంగీతంలో, అది కూడా హిందీ సినిమాకు పాడటం విశేషం. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. (చదవండి: సల్మాన్‌ మొదటి జీతం ఎంతో తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement