
అభివృద్ధి నిరంతర ప్రక్రియ
మెదక్‌జోన్: అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో రూ. 3.65 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి కోసం రూ. 30 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే రూ. 3.65 కోట్లతో శభాష్‌నగర్, వెంకట్రావ్‌నగర్ కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తుచేశారు. వచ్చే నాలుగేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామన్నారు. అంతకుముందు మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులకు రూ. 3.53 కోట్ల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు