
జెండా పండుగను విజయవంతం చేయాలి
శివ్వంపేట(నర్సాపూర్): ఈ నెల 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి సైదుల్, జిల్లా అధ్యక్షుడు యాదగిరి అన్నారు. మంగళవారం శివ్వంపేటలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కోసం దిమ్మె నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 30 సంవత్సరాలు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం వల్ల వర్గీకరణ సాధించుకున్నట్లు చెప్పారు. గ్రామస్ధాయి నుంచి ఎమ్మార్పీఎస్ జెండా పండుగలో అన్ని వర్గాల వారిని ఆహ్వానించి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పోచయ్య, లింగం, నర్సింలు, భిక్షపతి, సురేష్, తదితరులు ఉన్నారు.