
15 నెలల పాలనలో కలెక్టర్ మార్క్
మెదక్ కలెక్టరేట్: అన్నిరంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాలనలో కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ప్రభు త్వ లక్ష్యం నెరవేరాలి.. సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకు అందాలి అనే లక్ష్యంతో 15 నెలల కాలంలో 255 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే.. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలుచేస్తున్నారు. ప్లాస్టిక్‌ను అరికడుతూ.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నారు. వసతి గృహాల్లో బస చేస్తున్నారు. పంట పొలాల్లో రైతులను నేరుగా కలిసి వ్యవసాయ స్థితిగతులు తెలుసుకుంటున్నారు. వైద్యారోగ్య శాఖను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. తడి, పొడి చెత్తపై పెద్దఎత్తున అవగాహన కల్పి స్తున్నారు. ఈ– ఆఫీస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 1,700 ఫైల్స్‌ను ఆన్‌లైన్ ద్వారా పరిష్కరించారు. ప్రభుత్వ పాలనపై ఢిల్లీలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రసంగించి జిల్లా కీర్తిని చాటారు. పోలీస్, ఎకై ్సజ్ అధికారులను సమ న్వయం చేస్తూ జిల్లాలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నివారణకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.