
ఆర్‌ఆర్‌తో ట్రాఫిక్ సమస్యలు దూరం
నారాయణఖేడ్: రింగురోడ్డుతో ట్రాఫిక్ సమస్యలు దూరమవుతాయని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రింగురోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని రహదారిని విస్తరించడంతో పాటు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. పట్టణం చుట్టూ రోడ్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు పట్టణం విస్తీర్ణం కూడా పెరిగనుందన్నారు.
పేదల సంక్షేమానికి కృషి
ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషిచేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. క్యాంపు కార్యా లయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రా మాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి