
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
పెద్దశంకరంపేట(మెదక్): నిరుపేదలకు ప్రభుత్వ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నా మని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కమలాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 9 వేల ఇళ్లు మంజూరు చేశామని, ఇందులో 4,500 వరకు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న ఏఐ, డిజిటల్ తరగతులను వినియోగించుకోవాలని సూచించారు. బడీడు పిల్లలు వందశాతం పాఠశాలలకు వెళ్తుండటంపై గ్రామస్తులను అభినందించారు. అలాగే అధికారులు ప్రతీ శుక్రవారం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. మలేరియా, డెంగీ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓపెన్ ప్లాట్లు, జనావాసాల మధ్య నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అనంతరం ప్రజలకు నీటి నిల్వపై అవగాహన కల్పించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్‌చార్జి ఎంపీడీఓ షాకీర్‌అలీ, ఎంపీఓ జాకీర్ హుస్సేన్, మాజీ సర్పంచ్‌లు రాములు, శ్రీనివాస్‌గౌడ్, గ్రామ కార్యదర్శి రాజుగౌడ్, హౌసింగ్ ఏఈ ప్రియ తదితరులు ఉన్నారు.