కుట్టుకూలి అరకొరే! | Sakshi
Sakshi News home page

కుట్టుకూలి అరకొరే!

Published Mon, Mar 25 2024 9:20 AM

-

పొదుపు సంఘాలలోని మహిళలకు ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పం. వారికి చేయూతనిచ్చేందుకు సర్కార్‌ బడుల్లోని విద్యార్థులకు యూనిఫాంలు కుట్టే బాధ్యతను అప్పగించారు. దీంతో మహిళలంతా ఆనందించారు. ఇంతవరకు బాగానే ఉన్నా కుట్టు కూలి విషయం వచ్చేసరికి నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం ఒక్కో జతకు రూ.50మాత్రమే చెల్లిస్తోంది. ఇది సరిపోవడంలేదని, కూలిని పెంచాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. విద్యా రంగానికి రూ.కోట్లు ఖర్చుచేస్తున్నామని పాలకులు చెబుతున్నా.. పేద విద్యార్థుల యూనిఫాంల కుట్టుకూలి విషయంలో పిసినారి తనం చూపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గిట్టుబాటు కాని స్టిచ్చింగ్‌ చార్జీలు

ఈసారి మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 2.77లక్షల మంది విద్యార్థులు

ఒక్క జత కుడితే రూ.50లే ఇస్తున్న ప్రభుత్వం

డిజైన్లు మారినా ఐదేళ్లుగా అవే ధరలు

కూలి సరిపోవడంలేదంటున్న మహిళా సంఘాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement