స్ట్రాంగ్‌రూంలకు పటిష్ట భద్రత
హిందూపురం/హిందూపురం అర్బన్: ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. కేంద్ర సాయుధ బలగాలు, ఆర్మ్‌ర్డ్ రిజర్వుడ్ బలగాలు, సివిల్ పోలీసులను మోహరించామన్నారు. బుధవారం ఆయన హిందూపురం సమీపంలోని ‘బిట్’ కళాశాల, లేపాక్షి సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. స్ట్రాంగ్‌రూంల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించారు. స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా జనరేటర్లు సైతం ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూం పరిసర ప్రాంతాల్లో సంచరించేందుకు ఎవరికీ అనుమతిలేదన్నారు. ఓట్ల లెక్కింపు కోసం జూన్ 4న జిల్లా ఎన్నికల అధికారి, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలు తెరిచి ఈవీఎంలను బయటకు తీస్తామన్నారు. తప్పుడు ప్రచారం చేసినా, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
మూడంచెల భద్రత...
సాయుధ బలగాల పహారా
అవాంఛనీయ సంఘటనలకు
పాల్పడితే కఠిన చర్యలు
హెచ్చరించిన ఎస్పీ మాధవరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment