బీమా చెక్కు అందజేత
తిమ్మాపూర్: పోరండ్ల గ్రామానికి చెందిన ఆదర్శ పురుషుల పొదుపు సహకార సంఘం సభ్యుడు నర్సయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. సామూహిక నిధి బీమా 1, 2 క్లెయిమ్ రూ.60వేలు, అభయనిధి విపత్సహాయం రూ.10వేలు, పొదుపు బోనస్ వడ్డీ రూ.33,219 మొత్తం రూ1,03,219 చెక్కును నామిని సదిరే కనకవ్వకు సమితి అధ్యక్షుడు గుంటి వెంకటేశ్, సంఘం అధ్యక్షుడు నాగపురి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సదిరే సంపత్ అందించారు. సభ్యులు బిజిలీ సమ్మయ్య, బొజ్జ రాజమౌళి, నాగపురి మహేశ్, నీలం రాజ్‌కుమార్, బొజ్జ కొమురయ్య, నీలం సుదర్శన్, పల్లె అంజయ్య, బొజ్జ ఐలయ్య, వెల్ది కనకయ్య సంఘం అకౌంటెంట్ నూనె వెంకటేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment