రాజానగరం: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర స్థాయి ఉద్యమ శిక్షణ తరగతులను ఈనెల 17, 18 తేదీలలో గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం ఆ కళాశాలలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి.రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment