No Headline
కరీంనగర్‌రూరల్: యాసంగి వరికోత పనులు పూర్తయ్యాయి. వానాకాలం పంట సాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. హర్వెస్టర్లతో వరిపంటను కోసిన రైతులు ప్రస్తుతం వరికొయ్యలు, వరిగడ్డి వ్యర్థాలను పొలాల్లో తగులబెడుతున్నారు. వరిగడ్డి వ్యర్ధాలను తగులబెట్టకుండా నీళ్లు పెట్టి కలియ దున్నితే నేలకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. అయితే పలువురు రైతులు వ్యర్థాలను తగులబెట్టేందుకు మొగ్గు చూపుతుండటంతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. రైతులు వ్యర్థాలను తగులబెట్టకుండా పొలాల్లో కలియదున్నితే ఎంతో ప్రయోజనముంటుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment