
క్యాన్సర్ బాధితులకు రిమ్స్‌లో మెరుగైన వైద్యం
ఆదిలాబాద్‌టౌన్: క్యాన్సర్ బాధితులకు రిమ్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. బుధవారం రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వైద్య నిపుణుడు జక్కుల శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలో 300లకు పైగా క్యాన్సర్ ఆపరేషన్‌లు చేశారన్నారు. తాజాగా ఆహారనాళం సర్జరీ ఓపెన్‌లో కాకుండా ల్యాప్రోస్కోపీ ద్వారా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో నాలుగు క్లిష్టమైన సర్జరీలను పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. కార్డియాలజీ వైద్యులను నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో వైద్యులు సత్యనారాయణ, కార్తీక్, నరేందర్, దేవిదాస్, తదితరులు పాల్గొన్నారు.