
తాండూర్ సీఐ కుమారస్వామి బదిలీ
తాండూర్: తాండూర్ సీఐ కే.కుమారస్వామిని ఖమ్మం జిల్లా మధిర సర్కిల్‌కు బదిలీ చేస్తూ మల్టీజోన్–1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు ఏడాదిన్నర కాలం ఇక్కడ పని చేసిన ఆయన గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారు. నకిలీ విత్తనాల నిర్మూలనపై రైతులకు అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహించారు.
చెన్నూర్ రూరల్ సీఐగా బన్సిలాల్
చెన్నూర్ రూరల్ సీఐగా ఆర్.బన్సిలాల్‌ను నియామకం అయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న ఆయనకు పోస్టింగ్ కల్పిస్తూ ఐజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
హోటల్
యజమానులపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: మైనర్‌లను పనిలో పెట్టుకున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేశ్ హో టల్ యజమాని కేశవ్, జైఅంబే హోటల్ య జమాని రాజేష్ శర్మపై కేసు నమోదు చేసిన ట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. గణేశ్ హోటల్‌లో మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల బాలుడు సోహిల్ సోంట్‌వాల్, జైఅంబే హోటల్‌లో మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల బాలుడు సుజిల్ రాంకిషన్‌ను పనిలో పెట్టుకున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ జూనియర్ అసిస్టెంట్ సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు రెండు హోటాళ్ల యజమానులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు వివరించారు.
మద్యం విక్రేతపై..
ఆదిలాబాద్‌టౌన్: అధిక ధరకు మద్యం విక్రయిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లికి చెందిన కరోర శుభంపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వైన్స్ షాపుల నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి తన ఇంట్లో నిల్వ ఉంచి అధిక ధరకు విక్రయిస్తున్నాడన్నారు. బుధవారం మద్యం సీసాలను కొనుగోలు చేస్తున్న సమయంలో వన్‌టౌన్ పోలీసులు పట్టుకుని డౌన్‌టౌన్ విస్కీ 29 బాటిళ్లు, ఒరిజినల్ చాయిస్ 20 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.5,990 ఉంటుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తుండడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు.
విద్యుదాఘాతంతో
మూగజీవాలు మృతి
తానూరు: మండలంలోని ఝరి(బి)లో విద్యుదాఘాతంతో రెండు మూగజీవాలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతు గుర్ల శ్రీనివాస్ మంగళవారం రాత్రి వర్షం కురుస్తోందని తన ఎద్దు, ఆవును రేకులషెడ్డులో కట్టేశాడు. స్తంభం నుంచి షెడ్డులోకి సరఫరా అవుతున్న విద్యుత్ తీగలు రేకులు కోసుకుని తెగిపోవడంతో విద్యుత్ సరఫరా జరిగింది. షెడ్డులో కట్టేసిన ఆవు, ఎద్దు షాక్‌కు గురికావడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. వాటి విలువ రూ.లక్ష వరకు ఉంటాయని బాధిత రైతు వాపోయాడు.