
పాత నేరస్తుల బైండోవర్
కాగజ్‌నగర్‌టౌన్: గతంలో నాటుసారా, దేశీదారు అమ్ముతూ పట్టుబడిన 8 మంది పాత నేరస్తులను ఎకై ్సజ్ అధికారులు మంగళవారం తహసీల్దార్ మధుకర్ ఎదుట బైండోవర్ చే శారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మరోసారి నాటుసారా, దేశీదారు అమ్మి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే రూ.లక్ష జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు.
దేశీదారు పట్టివేత
కాగజ్‌నగర్‌టౌన్: మహారాష్ట్ర నుంచి కాగజ్‌నగర్‌కు కారులో అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యాన్ని సోమవారం రాత్రి పట్టుకున్నట్లు కాగజ్‌నగర్ ఎకై ్సజ్ సీఐ రవి తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.జ్యోతి ఆదేశాల మేరకు పట్టణంలోని ఈఎస్‌ఐ మూలమలుపు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న 17 కాటన్ల 90 ఎంఎల్ దేశీదారు బాటిళ్లు లభ్యమయ్యాయి. మద్యం విలువ సుమారు రూ.68 వేలు ఉంటుందన్నారు. కౌటాలకు చెందిన దుర్గం సాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో ఎస్సై లోబానంద్, సిబ్బంది రాజ్‌కుమార్, హుస్సేన్, మండల్, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థను నిర్మూలించాలి
పాతమంచిర్యాల: వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోతే రాజలింగు అన్నారు. మంగళవారం ప్రపంచ వ్యవసాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళారీ వ్యవస్థ వలన రైతులు తమ పంటలను సరైన ధరలకు అమ్ముకోలేకపోతున్నారన్నారు. పంటచేతికొచ్చిన సమయంలో అమ్మకం కోసం దళారులను ఆశ్రయించి కనీస మద్దతు ధర పొందలేకపోతున్నారన్నారు. దళారులు నిర్ణయించిన ధరకే పంటలను అమ్ముకుని ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. రైతులు పండించిన పంటలను నిలువ చేసుకుని వారికి నచ్చిన ధరకు విక్రయించుకునేలా ప్రభుత్వాలు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్‌ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సురేందర్, సతీశ్ పాల్గొన్నారు.
ఫిజియోథెరపీ సేవలకు దరఖాస్తుల స్వీకరణ
మంచిర్యాలఅర్బన్: ఐఈఆర్‌సీ, నాన్ ఐఈఆర్‌సీలో ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు ఫిజియోథెరపీ సే వలు అందించేందుకు గుర్తింపు పొందిన స్టేట్ పా రామెడికల్ బోర్డు ద్వారా బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సు చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు స్తానిక మండలానికి చెందిన వారికి ప్రాధాన్యత ఉంటుందని, ఈనెల 5 లోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారానికి రెండు సార్లు సీడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలకు ఫిజియోథెరపీ సేవలు అందించాల్సి ఉంటుందన్నారు.

పాత నేరస్తుల బైండోవర్