ఫార్మా పేలుడులో దండేపల్లి వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

ఫార్మా పేలుడులో దండేపల్లి వాసి మృతి

Jul 2 2025 6:51 AM | Updated on Jul 2 2025 7:06 AM

ఫార్మ

ఫార్మా పేలుడులో దండేపల్లి వాసి మృతి

దండేపల్లి: సంగారెడ్డి జిల్లా సిగాచి ఫార్మా పరిశ్రమలో సోమవారం జరిగిన పేలు డు ఘటనలో మంచి ర్యాల జిల్లా దండేపల్లి కి చెందిన వొజ్జకేశవుల నాగేశ్వరరావు, అలి యాస్‌ రాజు (52) మృతి చెందాడు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసిన నాగేశ్వర్‌రావు గతంలో కొద్దిరోజులు సిర్పూర్‌ పేప ర్‌ మిల్‌లో పనిచేశాడు. ఆ తరువాత హైదరా బాద్‌ వెళ్లి పటాన్‌ చెరువులో నివాసం ఉంటూ పదేళ్లుగా సిగాచి ఫార్మా పరిశ్రమలో క్వాలిటీ సెల్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. మృతునికి భార్య హేమలత, ఇద్దరు కుమారులున్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి ..

వాంకిడి: మద్యం మ త్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ప్రశాంత్‌ తెలిపారు. మండలంలోని రాజీవ్‌ నగర్‌ గ్రామానికి చెందిన నాయిని మనోహర్‌ (45) గత నెల 26న మద్యం మత్తులో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు..

ఆదిలాబాద్‌టౌన్‌: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పప్పు ర మణ (40) జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రి లో మంగళవారం మృతి చెందినట్లు టూటౌన్‌ ఎస్సై ముకుంద్‌రావు తెలిపారు. మహారాష్ట్రలోని కిన్వట్‌లో కూరగాయల నర్సరీ నిర్వహిస్తున్న రమణ కిన్వట్‌ నుంచి ఆది లాబాద్‌ వైపు మ్యాక్స్‌ బొలెరో వాహనంలో వస్తుండగా ఆదిలాబాద్‌ వైపు నుంచి కిన్వట్‌ వైపు వెళ్తున్న మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు కిన్వట్‌–అంబాడి ప్రాంతంలో ఢీకొట్టింది. తీవ్రగా యాలు కావడంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆ స్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అ ప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు జీరో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

గల్ఫ్‌లో టెంబుర్నివాసి అనుమానాస్పద మృతి

నర్సాపూర్‌(జి): ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశానికి వెళ్లిన జిల్లాకు చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ (జి) మండలంలోని టెంబుర్ని గ్రామానికి చెందిన బొగడ మీది సంతోష్‌ (36) జూన్‌ 21న గల్ఫ్‌ దేశంలోని అబుదాబికి కూలీపని నిమిత్తం వెళ్లాడు. ఇంతలో ఏంజరిగిందో తెలియదుకానీ అక్కడి ఎంబసీ, ముస్సాఫా పోలీస్‌ స్టేషన్‌ నుంచి బొగడమీది సంతోష్‌ మృతి చెందాడని మంగళవారం తనకు ఫోన్‌ వచ్చిందని మృతుని భార్య ప్రేమల తెలిపింది. తన భర్త మృతికి గల కారణాలు తెలపాలని, మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా చూడాలని వేడుకుంటోంది.

ఫార్మా పేలుడులో   దండేపల్లి వాసి మృతి1
1/2

ఫార్మా పేలుడులో దండేపల్లి వాసి మృతి

ఫార్మా పేలుడులో   దండేపల్లి వాసి మృతి2
2/2

ఫార్మా పేలుడులో దండేపల్లి వాసి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement