
దళితుల అభివృద్ధికి పాటుపడాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): దళితుల అభివృద్ధికి పాటుపడాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్ అన్నారు. మంగళవారం గుడిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అభయహస్తం పేరుతో అర్హులైన దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో విఫలమైందన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా దళితుల ఆర్థికాభివృద్ధికి కేటాయించాలని, దళితులకు భూ పంపిణీ చేపట్టాలని, పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని, ప్రైవేట్ రంగాల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న, జిల్లా ఉపాధ్యక్షుడు రవి, సహాయ కార్యదర్శి తిరుపతి, జాతీయ సమితి సభ్యుడు అశోక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజారత్నం, ఏఐవైఎఫ్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు అబ్రహం, ఏలియా, యోసేపు, తదితరులు పాల్గొన్నారు.