
జిల్లాస్థాయి క్రికెట్ జట్టు ఎంపిక
బెల్లంపల్లి: పట్టణంలోని మురళి మెమోరియల్ క్రికెట్ అకాడమీలో అండర్ –16, 19 విభాగాల్లో క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ పోటీలను ప్రముఖ వైద్యుడు జగదీశ్‌నాయుడు ప్రారంభించారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు నిర్మల్, ఆదిలాబాద్, ఆర్మూర్, నిజామాబాద్, బెల్లంపల్లిలో జరిగే టోర్నమెంట్‌లో పాల్గొంటారు. కార్యక్రమంలో న్యాయవాది నల్లుల సంగీత, తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ జిల్లా ఇన్‌చార్జి నర్సింగ్, వెంకటేశ్వర్లు, కోచ్‌లు శేఖర్, గౌతమ్, ఒకేషనల్ ప్రిన్సిపాల్ రాజేశ్ పాల్గొన్నారు.