● పలు ఓసీపీల విస్తరణకు ప్రతిపాదనలు ● టైగర్‌ రిజర్వు కన్జర్వేషన్‌తో ప్రతిబంధకాలు | - | Sakshi
Sakshi News home page

● పలు ఓసీపీల విస్తరణకు ప్రతిపాదనలు ● టైగర్‌ రిజర్వు కన్జర్వేషన్‌తో ప్రతిబంధకాలు

Jun 7 2025 12:08 AM | Updated on Jun 7 2025 12:08 AM

● పలు ఓసీపీల విస్తరణకు ప్రతిపాదనలు ● టైగర్‌ రిజర్వు కన్

● పలు ఓసీపీల విస్తరణకు ప్రతిపాదనలు ● టైగర్‌ రిజర్వు కన్

అనుమతుల కోసం..

బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను సాధించడానికి సింగరేణి యాజమాన్యం ఎంతోదూర దృష్టితో వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా గోలేటి, మహావీర్‌ఖని ఓపెన్‌కాస్ట్‌ గనులను ప్రతిపాదించి పావులు కదుపుతున్నా ఇంకా అనుమతుల రాకకు కాలయాపన జరుగుతోంది. వాస్తవానికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో గోలేటి ఓపెన్‌కాస్ట్‌గనిని ప్రారంభించాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ తీరుతో సింగరేణి యాజమాన్యం ఒకింత నిరాశశతో ఉండగా, అనుమతులు వచ్చే ప్రస్తుత కీలక సమయంలో కుమురంభీమ్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వు ఏర్పడడంతో సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయనే అభిప్రా యం కార్మిక వర్గం నుంచి వినిపిస్తోంది.

బెల్లంపల్లి/తాండూర్‌: కుమురంభీం ఆసిఫాబాద్‌ జి ల్లా ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్లు ‘టైగ ర్‌ కన్జర్వేషన్‌ రిజర్వు’గా రూపాంతరం చెందాయి. దీంతో బెల్లంపల్లి ఏరియాలో కొత్తగా ప్రతిపాదించిన గోలేటి, మహావీర్‌ఖని(ఎంవీకే) ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతికి ప్రతి బంధకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మ హారాష్ట్ర ప్రాంతం నుంచి పులుల రాకకు ఆయా డివి జన్లు ప్రధాన కారిడార్‌గా ఉండగా ప్రస్తుతం ‘కుమురంభీం టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వు’గా మార్చారు. ఈ మేరకు గత శుక్రవారం అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీం ఉత్తర్వులు జారీ చేశారు. 1492.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వులో 78 రిజర్వు బ్లాక్‌లు గుర్తించి నిర్ధారించా రు. మహారాష్ట్రలోని తడోబా–అంధేరి టైగర్‌ రిజర్వు నుంచి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వుకు కొంతకాలంగా పు లులు వలస రావడం తెలిసిందే. ఈ క్రమంలో తడోబా–కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులకు వారధిగా ఉన్న ఆసిఫాబాద్‌–కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్ల పరిధిలో పు లులు సంచారం చేస్తూ ఆవాసం ఏర్పాటు చేసుకో వడం ప్రాధాన్యతను సంతరించుకోగా.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ వన్యప్రాణి అభయారణ్యం, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రంలోని ఇంద్రావతి టైగర్‌ రిజర్వుతో అనుసంధానమయ్యే కుమురంభీం టైగర్‌ కన్జర్వేషన్‌ రి జర్వు ఎంతో ముఖ్యమైన కారిడార్‌గా అవతరించనుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రిజర్వు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు పుష్కలంగా ఉండడంతో గోలేటి, మహావీర్‌ ఖని ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులకు సింగరేణి యాజమాన్యం కొన్నాళ్ల క్రితం ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమై న అటవీ, పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తోంది. వాస్తవానికి గత ఏడాదిలోనే అనుమతి రావాల్సి ఉండగా కాలయాపన జరుగుతోంది. కనీసం ఈ ఏడాదైనా అనుమతి వ స్తుందనే ఆశతో ఉండగా ఆకస్మికంగా అటవీ శాఖ కుమురంభీం టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆందోళనకు గురి చే స్తోంది. బొగ్గు గనులు అంతరించి మనుగడ కోల్పోయిన బెల్లంపల్లి ఏరియాలో గోలేటి, మహావీర్‌ ఖని ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల విస్తరణతో పూర్వ వైభవం వస్తుందనే భరోసాతో ఉండగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రశ్నార్థకంగా మార్చాయి.

ఆసిఫాబాద్‌ అటవీ డివిజన్‌ పరిధిలో..

కుమురంభీం టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వు పరిధిలో ఆ సిఫాబాద్‌ అటవీ ప్రాంతం 57,564 హెకార్లలో విస్తరించి ఉంది. ఈ డివిజన్‌ పరిధిలో ఉన్న రెబ్బెన రేంజ్‌ పరిధి 14574.39 హెక్టార్లుగా గుర్తించారు. రెబ్బె న రేంజ్‌ పరిధిలో ఉన్న గోలేటి, మహావీర్‌ ఖని ఓపె న్‌కాస్ట్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే తలంపులో సింగరేణి యాజమాన్యం ఉంది. గోలేటి ఓపెన్‌కాస్ట్‌ గని ఏర్పాటుకు 1358.26 హెక్టార్ల భూమి అవసరమని అంచనా వేశారు. ఇందులో 673.26 హె క్టార్ల వరకు అటవీ భూమి ఉండగా మిగతా 685 హె క్టార్లు ప్రైవేట్‌, ప్రభుత్వ భూమిని సేకరించాలని ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మహావీర్‌ ఖని ఓపెన్‌కాస్ట్‌ కోసం సుమారు 811 హెక్టార్ల భూ మిని సేకరించనుండగా ఇందులో 600 హెక్టార్ల వర కు అటవీ, మరో 211 హెక్టార్ల ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు ఉన్నట్లు తెలుస్తోంది. రెబ్బెన అటవీ రేంజ్‌ పరిధిలో ఉన్న ఆయా ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్‌ గ నుల ప్రాంతంలో కొంతకాలం నుంచి పులులు సంచరిస్తుండడంతోపాటు జంతువులను వధించడం జ రుగుతోంది. పులుల ఆవాసానికి ఈ ప్రాంతం ఎంతో కీలకమైనదిగా అటవీ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇబ్బందులు ఉండకపోవచ్చు

కొత్తగా ప్రతిపాదించిన గోలేటి, మహావీర్‌ ఓపెన్‌కాస్ట్‌ గనుల ఏర్పాటుకు పర్యావరణ, అటవీ అనుమతులు రావాల్సి ఉంది. వీటి కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా గోలేటి ఓపెన్‌కాస్ట్‌ గనికి అనుమతి సత్వరంగా వస్తుందనే ఆశతో ఉన్నాం. ఇప్పటికే ఆలస్యం కావడంతో ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశాం. కొత్తగా ఏర్పాటైన కుమురంభీమ్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వుతో ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్‌ గనుల అనుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు.

– విజయభాస్కరరెడ్డి,

బెల్లంపల్లి ఏరియా జీఎం

ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్‌ గనుల ప్రొఫైల్‌

ఓసీపీ గని పేరు విస్తరణకు ప్రతిపాదించిన గనులు బొగ్గు నిక్షేపాలు బొగ్గు గ్రేడ్‌ ఏడాదికి ఉత్పత్తి లక్ష్యం గని జీవిత కాలం

గోలేటి గోలేటి–1, 1ఏ, బీపీఏ ఓసీపీ 62 మి.టన్నులు జీ–10, జీ–11 3.5 మి.టన్నులు 18ఏళ్లు సుమారు

మహావీర్‌ ఖని ఎంవీకే –1, 2, 3, 4, 5, 6 40 మి.టన్నులు జీ–10 2.8 మి.టన్నులు 12 ఏళ్లు సుమారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement