
ఆదివాసీలు రాజకీయంగా ఎదగాలి
జన్నారం: ఆదివాసీలను చైతన్యపర్చి రాజకీయంగా ముందుకు తీసుకురావడానికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ జాతీయ ఆదివాసీ ప్రోగ్రాం కన్వీనర్ రాహుల్ బల్ అన్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని హరితరిసార్ట్‌లో మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఆదివాసీలు రాజకీయంగా ఎదగలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు రాజకీయంగా ఎదిగేందుకు శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన సహకార చైర్మన్ కోట్నాక తిరుపతి, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకురాలు ఆత్రం సుగుణ, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.