
పాఠ్యపుస్తకాలు వచ్చేస్తున్నాయ్
● అవసరమైనవి 3,73,820 ● చేరినవి 1,95,360
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసే ఉచిత పాఠ్య పుస్తకాలు జిల్లా బుక్ డిపోకు చేరాయి. వేసవి సెలవుల్లోనే గుడిపేటలోని బుక్‌డిపోకు సరఫరా అవుతుండగా.. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు అందించేందుకు చర్యలు వేగవంతం చేశారు. ప్రతీసారి వేసవి సెలవుల్లోనే పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రాలకు సరఫరా చేస్తుండగా.. ఈసారి విద్యాసంవత్సరం ముగింపునకు ముందే స రఫరా చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల బలోపేతం, విద్యాప్రమాణాల పెంపుపై దృష్టి సా రించింది. అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తోంది. ఏఐ పాఠాల బోధన సాగనుంది. విద్యార్థుల యూనిఫాం క్లాత్ జిల్లాకు చేరగా.. కుట్టు పని కోసం మహిళా సమాఖ్య సభ్యులకు అందజేశారు. జిల్లాకు 3,73,820 ఉచిత పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ఇందులో 66శాతం పుస్తకాలు జిల్లా బుక్‌డిపోకు వచ్చాయి. ఇప్పటివరకు 1,95,360 పుస్తకాలు జి ల్లాకు చేరగా.. 1,12,460 పుస్తకాలు రావాల్సి ఉంది. ప్రతీ తరగతికి ఒక్కో సబ్జెక్టు పాఠ్య పుస్తకం రా వాల్సి ఉంది. పూర్తి స్థాయిలో వచ్చాక ఎంఈవో కార్యాలయాలకు చేరవేస్తారు. అక్కడి నుంచి పాఠశాలలకు పంపిస్తారు. కొత్త పుస్తకాల్లో తెలంగాణ తల్లి చిత్రంతోపాటు రాష్ట్ర గీతం ప్రచురించారు. గత ఏడాది మిగిలిన దాదాపు 12వేల పుస్తకాలు వెనక్కి పంపించాలా..? పాఠశాలలకు సరఫరా చేయాలా..? వద్దా అనేది ఉన్నతాధికారుల నుంచి స్పష్టత లేకుండాపోయింది. కొత్త పాఠ్యపుస్తకాలను క్యూఆ ర్ కోడ్‌తో ముద్రిస్తున్నారు. బయట మార్కెట్‌కు తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.