
మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య
నర్సాపూర్(జి): మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని బూరుగుపల్లి(జి) అనుబంధ గ్రామమైన సూర్యంతండాకు చెందిన చవాన్ సాయినాథ్ (28) గతేడాది బొలెరో వాహనాన్ని ఫైనాన్స్‌లో కొనుగోలు చేశాడు. నెలనెలా కిస్తీలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండేవాడు. ఆదివారం మద్యం మత్తులో ఇంట్లో పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని భార్య చవాన్ సురేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.