బైక్‌ దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌ దొంగ అరెస్ట్‌

Apr 17 2025 1:00 AM | Updated on Apr 17 2025 1:00 AM

బైక్‌ దొంగ అరెస్ట్‌

బైక్‌ దొంగ అరెస్ట్‌

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన బైక్‌ దొంగ షేక్‌ నదీమ్‌ను టూటౌన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బస్టాండ్‌లో పార్కింగ్‌ చేసిన మూడు ద్విచక్ర వాహనాలను పదిరో జుల కాల వ్యవధిలో దొంగిలించాడు. ఇందిరా నగర్‌ సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చి విచారించగా, మూడు వాహనాలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ కరుణాకర్‌ రావు తెలిపారు.

జైనథ్‌లో..

ఆదిలాబాద్‌టౌన్‌: జైనథ్‌ మండలంలోని మాకో డకు చెందిన బైక్‌ దొంగ రామెల్లి కిరణ్‌ను వన్‌టౌన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మావలకు చెందిన రగ్దివార్‌ ప్రశాంత్‌ ముథూట్‌ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 9న కార్యాలయం ఎదుట బైక్‌ పార్కింగ్‌ చేయగా, సాయంత్రం వచ్చి చూసే సరికి వాహనం కనిపించలేదు. దీంతో ఆయన వన్‌టౌన్‌లో ఫి ర్యాదు చేశాడు. శివాజీచౌక్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి నిందితుడిని విచారించగా బైక్‌ చోరీకి పాల్పడినట్లు ఒ ప్పుకున్నాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు.

మట్కా నిర్వాహకుడికి రూ.లక్ష జరిమానా

ఆదిలాబాద్‌టౌన్‌: మట్కా నిర్వాహకుడికి రూ.లక్ష జరిమానా విధించినట్లు టూటౌన్‌ సీఐ కరుణాకర్‌ రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన మట్కా నిర్వాహకుడు లతీఫ్‌, రెహాన్‌ తండ్రి, కొడుకులు ఆన్‌లైన్‌లో మట్కా ఆడుతున్నారు. ఇదివరకు బైండోవర్‌ చేయగా బుధవారం ఆన్‌లైన్‌లో మట్కా నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. తహసీల్దార్‌ ఎదుట వారిని హాజరుపర్చగా పది రోజుల్లో రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించారు. నిందితుల నుంచి రూ.500, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి తీవ్ర గాయాలు

ఇంద్రవెల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం రాత్రి మండలంలోని వడగామ్‌ సమీపంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్‌ మండలంలోని లక్కుగూడ గ్రామానికి చెందిన కొరెంగా రాము, కొరెంగా హేమంత్‌ కు మార్‌, ఇంద్రవెల్లి మండలంలోని పొల్లుగూడ గ్రామానికి చెందిన బాలుడు జుగ్నాక గౌతంలు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న స మయంలో మోడిగూడ సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో కొరెంగా రాము, కొరెంగా హే మంత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. జుగ్నాక్‌ గౌ తంకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. రాము, హే మంత్‌కుమార్‌ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement