
భూ భారతితో భూసమస్యలు పరిష్కారం
● కలెక్టర్ కుమార్‌దీపక్
దండేపల్లి: ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘భూ భారతి’తో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. భూభారతిపై తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణితో గతంలో కొన్ని సమస్యలకు పరి ష్కారం లభించక రైతులు ఇబ్బందులు పడ్డారని, భూ భారతితో మాత్రం చాలా సమస్యలకు పరి ష్కారం లభిస్తుందన్నారు. దీనిని వచ్చే జూన్ నుంచి పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని గీత కార్మికులకు ఎకై ్సజ్‌శాఖ ద్వారా ఉచితంగా అందించిన కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, బీసీవెల్ఫేర్ ఆఫీసర్ పురుషోత్తం, ఏడీఏ అనిత, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో ప్రసాద్, డీటీ విజయ, ఆర్‌ఐ భూమన్న, ఇన్‌చార్జి ఏవో శ్రీకాంత్, బ్యాంక్ మేనేజర్ భూంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అవగాహన ఉంటే సమస్యలకు పరిష్కారం
జన్నారం: భూభారతి చట్టంపై అవగాహన ఉంటే అనేక భూ సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుంద ని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతిపై అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా జన్నారంలోని డీలర్లు ఇచ్చిన కల్తీ అన్నపూర్ణ వరి విత్తనాలతో నష్టపోయామని, ధాన్యాన్ని ఎవరూకొనడం లేదని బాదంపల్లికి చెందిన రైతు మల్లంపెల్లి శ్రీనివాస్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాడు. స్పందించిన కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారిని పిలిచి సంబందిత డీలర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏడీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి జీ.కల్పన, త హసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ రవి, రాజన్న, డీటీ రామ్మోహన్, ఏవో సంగీత, తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు.
కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన
కలెక్టర్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేటలోని నూతన భవనంలోకి మారిన కేంద్రీయ విద్యాలయాన్ని కలెక్టర్ కుమార్‌దీపక్ సందర్శించారు. తరగతి గదులు, ఫర్నీచర్, కంప్యూటర్, బోధనా పరికరాలను పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ జె.ప్రసాద్, అధ్యాపక బృందం ఉన్నారు.