మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో శుక్రవారం కురిసి న అకాల వర్షంతో 335 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు శనివారం ప్రాథమిక సర్వేలో గుర్తించారు. దండేపల్లి, జన్నా రం, హాజీపూర్ మండలాల్లో 45 మంది రైతులకు చెందిన వరి పంట 80 ఎకరాలు, 113 మంది రైతు ల మొక్కజొన్న 255 ఎకరాలు.. మొత్తంగా 158 మంది రైతులకు సంబంధించి 335 ఎకరాల్లో నష్టం వాటల్లినట్లు తేల్చారు. రూ.12కోట్ల వరకు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పూర్తి స్థాయిలో సర్వే చేపడితే గానీ నష్టం వివరాలు తెలుపలేమని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. భీమిని, నెన్నెల, మందమర్రి, హాజీపూర్, కోటపల్లి, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల్లో 19 విద్యుత్ స్తంభాలు విరిగి, తీగలు తెగి విద్యుత్ శాఖకు రూ.12 లక్షల మేర నష్టం వాటల్లింది. దెబ్బతిన్న పంటలకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్న మండలాలు
మండలం గ్రామాలు రైతులు ఎకరాలు
దండేపల్లి 7 37 86
జన్నారం 7 42 92
హాజీపూర్ 6 79 157