
మాట్లాడుతున్న ఏసీపీ సదయ్య
తాండూర్: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా ఎన్నికలు సాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య అన్నారు. బుధవారం మండలంలోని మాదా రం పోలీస్‌స్టేషన్ నుంచి మండల కేంద్రం వర కు కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి కవాతు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే ఎలాంటి చర్యలనైనా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. తాండూర్ సీఐ శ్రీనివాస రావు, ఎస్సైలు రాజశేఖర్, నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.