
–సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహనకు ఎక్కువ మార్కులు ఉన్నందున పుస్తకంలోని ముఖ్యమైన భావనలు అర్థం చేసుకుని అడిగిన ప్రశ్నకు సరైన రీతిలో సమాధానాలు రాయాలి. వివరించటం, పోలికలు భేదాలు తెలపటం, కారణాలు, ఫలితాలు చెప్పటం, వర్గీకరించడం లాంటి రూపాల్లో ప్రశ్నలు ఉంటాయి. పటనైపుణ్యాలు, సమాచార నైపుణ్యాలు, ప్రశంస–సున్నితత్వం, ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యలు రాయటంపై సాధన చేయాలి. పటాలు, పట్టికలు, గ్రాఫ్‌లపై పట్టు ఉంటే ఎక్కువ మార్కులు వస్తాయి. పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. అభ్యాస దీపికలోని అంశాలను బాగా చదవాలి.
– మహేశ్, సోషల్ టీచర్, జెడ్పీహెచ్‌ఎస్ బాలుర, మంచిర్యాల
