
మంచిర్యాల కేజీబీవీ నుంచి వెళ్తున్న విద్యార్థులు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 15 నుంచి ప్రారంభం కాగా చివరి రోజు ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షకు 6,910 విద్యార్థులకు గాను 6,601 మంది హాజరయ్యారు. 309 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 6,040 మందికి గాను 5,770 మంది హాజరు కాగా 270 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 870 మందికి గాను 831 హాజరు కాగా 39 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో శైలజ తెలిపారు. లక్సెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఇద్దరు విద్యార్థులపై మాల్‌ప్రాక్టిస్ కేసు నమోదైనట్లు తెలిపారు.
ఇంటిబాట పట్టిన విద్యార్థులు
పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. పరీక్ష కేంద్రాల నుంచి బయటకు రాగానే ఆనందాల్లో మునిగి తేలారు. తెల్లవారింది మొదలు అర్ధరాత్రి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ఉపశమనం పొందారు. వసతిగృహల్లో ఉండే విద్యార్థులు ఇంటిబాట పట్టారు.