మంచిర్యాలఅర్బన్: శ్రీరామనవమి సందర్భంగా జి ల్లాలోని రామాలయాల్లో గురువారం సీతారాముల కల్యాణ వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మంచిర్యాలలోని గౌతమినగర్ కోదండరామాల యం, తిరుమలగిరి కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, ఏసీసీ, రైల్వేస్టేషన్ కోదండ రామాలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బుధవారం గౌతమినగర్ కోదండ రామాలయంలో దైవమూర్తులను ఎమ్మెల్యే దివాకర్‌రావు దర్శించుకున్నా రు. ఆలయ కమిటీ చైర్మన్ సిరిపురం రాజేశ్, కౌ న్సిలర్లు నాంపల్లి మాధవి శ్రీనివాస్, పద్మకొండల్‌రావు పాల్గొన్నారు.
ఆలయాలు ముస్తాబు
దండేపల్లి/బెల్లంపల్లి/భీమారం/తాండూర్/భీమిని/చెన్నూర్‌రూరల్/జైపూర్: దండేపల్లి మండల కేంద్రంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో పచ్చని పందిరి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూజలు నిర్వహించారు. హనుమాన్ దీక్షా స్వాములు పాల్గొన్నారు. బెల్లంపల్లి కోదండ రామాలయంలో వేడుకల కోసం నిర్వాహక కమిటీ ఏర్పాట్లు చేసింది. దాదాపు లక్ష మంది వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో వసతులు కల్పించారు. భీమారంలోని కోదండ రామాలయంలో రూ.2.50 లక్షల వ్యయంతో ఆలయానికి రంగులు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. తాండూర్ మండలంలోని మా దారంటౌన్‌షిప్, కొత్తపల్లి, అచ్చులాపూర్, రేచినీ, కాసిపేట, బోయపల్లి, కిష్టంపేట గ్రామాల్లో ఆలయాల్లో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు. భీమిని, కన్నెపల్లి మండలాల్లో ఆలయాలను భక్తులు తీర్చిదిద్దుతున్నారు. జైపూర్ మండల కేంద్రంలోని హన్‌మాన్ ఆలయంలో కల్యాణ మహోత్సవానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
సుద్దాలలో పరిశీలన
చెన్నూర్‌రూరల్: మండలంలోని సుద్దాల గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవ ఏర్పాట్లను చెన్నూర్ పట్టణ సీఐ వాసుదేవరావు బుధవారం పరిశీలించారు. పార్కింగ్ స్థలాన్ని సందర్శించి సూచనలు చేశారు. ఆలయ అర్చకుడు అత్తిని మహేందర్‌శర్మ, బీఆర్‌ఎస్ నాయకులు పోలు రవి పాల్గొన్నారు.
ఎదుర్కోళ్లు..
మందమర్రిరూరల్/మంచిర్యాలఅర్బన్/తాండూర్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మందమర్రి పట్ట ణంలోని యాపల్ ఏరియా రామాలయం, మూడో జోన్‌లోని సీతారామాలయం, పాలచెట్టు హనుమాన్ ఆలయంలో కల్యాణోత్సం నిర్వహించనున్నారు. హ నుమాన్ ఆలయంలో నిర్వహించే కల్యాణానికి బుధవారం ఎస్సై చంద్రకుమార్ ఇంటి నుంచి, మూడో జోన్‌లోని రామాలయంలో కల్యాణానికి ఆలయ క మిటీ చైర్మన్, కేకే–5 గని మేనేజర్ భూశంకరయ్య ఇంటి వద్ద ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల గౌతమినగర్ కోదండ రామాలయంలో బుధవారం రాత్రి సీతారామచంద్రస్వామి ఎదుర్కొలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ర థంపై దేవతామూర్తుల శోభాయాత్ర వీధుల గుండా ఆలయం వరకు సాగింది. ఆలయ కమిటీ చైర్మన్ సిరి పురం రాజేశ్, సభ్యులు పాల్గొన్నారు. తాండూర్ మండలం మాదారం టౌన్‌షిప్ కోదండ రామాలయంలో సీతారామచంద్రమూర్తుల ఎదుర్కోలు కా ర్యక్రమం ఘనంగా నిర్వహించారు. మందనపు సరి త, రామారావు, భద్రపు రేఖ, వేణుకుమార్ దంపతులు పాల్గొనగా బ్రహ్మశ్రీ మొట్టు అవదూతశర్మ వేద మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల విగ్రహాలను ఊరేగింపు సాగింది. హాజీపూర్ మండలంలో సీతా రాముల కల్యాణ ఉత్సవాలు బుధవార ప్రారంభమయ్యాయి. ఉదయం సీతారాముల కల్యాణ ఘట్టంలో భాగంగా పాలపొరక, మంగళస్నానాలు తలంబ్రాలు, ఎదుర్కొళ్లు వేడుకలా నిర్వహించారు. భక్తులు, మహిళలు మంగళహారతులతో పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణం చూతమురారండి