
కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు
పాతమంచిర్యాల: ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులంతా మిషన్ భగీరథ నీటినే తాగేలా చర్యలు తీసుకోవాలని ఆమ్‌ఆద్మీ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ నయీంపాషా బుధవారం కలెక్టర్ బాదావత్ సంతోష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్, ఎమ్మెల్యే కార్యాలయాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు వేసి నల్లా కనెక్షన్లు ఇచ్చి కలెక్టర్, ఎమ్మెల్యేతో సహా అధికారులంతా ఆనీటినే తాగాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశాల్లో మినరల్ వాటర్‌ను మాని మిషన్ భగీరథ నీటిని తాగి ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి మినరల్, ఫ్యూరిఫైడ్ వాటర్ అనుమతించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు నల్ల నాగేంద్రప్రసాద్, విజయ్, శ్రీకాంత్, కళ్యాణ్, రాజేందర్ పాల్గొన్నారు.