ఎస్టీ హాస్టల్‌ను సందర్శించిన న్యాయమూర్తి
గద్వాల క్రైం: మంగళవారం ఉదయం గద్వాల బాలుర ఎస్టీ హాస్టల్ విద్యార్థులు అల్పహారం ఉప్మా తిని 14 మందితీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై బుధవారం గద్వాల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి లక్ష్మి హాస్టల్‌ను సందర్శించి అక్కడి సదుపాయాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు న్యాణమైన ఆహారం అందించే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కలుషిత అల్పహారం తిని అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు ధ్రువీకరించారన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ భవనం శిఽథిలావస్థలో ఉండడం, సరైన స్నానపు గదులు, డ్రైనేజీ వ్యవస్థ స్వచ్ఛమైన తాగునీరు తదితర సమస్యలను న్యాయమూర్తి గుర్తించారు. అనంతరం న్యాయమూర్తి వంటగదిని పరిశీలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సమగ్ర నివేదికలను అందిచాలని వార్డెన్ పవన్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై న్యాయ సేవాధికార సంస్థ సమగ్ర నివేదికలను ఉన్నతాధికారులకు అందజేసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జడ్జి వెంట లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజేందర్, శ్రీనివాసులు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.


