రేపటి నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో ఇండోర్ స్టేడియంలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు 51వ అంతర్‌జిల్లా (రాష్ట్రస్థాయి) జూనియర్ బాలుర కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ టోర్నీలో 32 జిల్లాలతో హైదరాబాద్ నుంచి రెండు జట్లు పాల్గొంటాయని తెలిపారు. క్రీడాకారులు, అధికారులతో కలిసి దాదాపు 800 మంది పాల్గొంటారని పేర్కొన్నారు. లీగ్ కమ్‌నాకౌట్ పద్ధతిలో నాలుగు మ్యాట్‌లపై దాదాపు 90 మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. టోర్నీలో ప్రతిభ కనబరిచిన వారిని జనవరి 14 నుంచి 19 వరకు ఏపీలో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర జట్టుకు జిల్లా కేంద్రంలోనే ప్రత్యేక కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. క్రీడాకారులకు మాడ్రన్ స్కూల్, టీఎన్‌జీవో భవన్, అంబేద్కర్ కళాభవన్, బీపీహెచ్‌ఎస్, స్కౌట్స్ భవన్‌లో వసతి, భోజన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈనెల 5న సాయంత్రం 3 గంటలకు జరిగే ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, 7న జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి ఉమామహేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు దామోదర్‌రెడ్డి, సభ్యులు నర్సింలు, రాంచంద్రయ్య, యూ.శ్రీనివాసులు, బాల్‌రాజు, పాపారాయుడు పాల్గొన్నారు.


