అన్నదమ్ముల సవాల్
● నర్సింగాపురంలో సర్పంచ్ స్థానానికి పోటీ
మదనాపురం: మండలంలోని నర్సింగాపురం గ్రామంలో సర్పంచ్ బరిలో అన్నాదమ్ములు బడుగుల రాములు, బడుగుల ఆంజనేయులు నిలిచారు. గ్రామ సర్పంచ్ స్థానం ఈసారి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయింది. అన్న రాములు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా.. తమ్ముడు ఆంజనేయులు బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో నిలిచారు. సాధారణంగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సహజం. కానీ వీరి విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. తమ మధ్య రాజకీయ పోరు ఉన్నా.. అది కేవలం ఎన్నికల ప్రచారం వరకేనని, ఇంటికి రాగానే అన్నదమ్ములమే అంటున్నారు. అమ్మానాన్నలు నేర్పిన సంస్కారం, ఆప్యాయత రాజకీయాల కంటే గొప్పవని చెబుతున్నారు. ప్రచారంలో ఒకరినొకరు విమర్శించుకోకుండా, గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారిస్తున్నారు. ఓటు ఎవరికి వేయాలనే విషయంలో ఓటర్లు అయోమయానికి గురవుతున్నా.. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆప్యాయత, ప్రేమానురాగాలను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.
బడుగుల
ఆంజనేయులు
అన్నదమ్ముల సవాల్


