చిన్నగూడూరు: నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ప్రతీ ఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మధుకర్ బాబు అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నగూడూరు, జయ్యారం గ్రామపంచాయతీ కార్యాలయల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన సందర్శించారు. నామినేషన్ ప్రక్రియ వివరాలను ఎంపీడీఓ సుజాతను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగుకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్‌కుమార్, ఎంపీఓ రజని, ఎన్నికల అధికారులు ఉన్నారు.
ప్రశాంతంగా జరిగేలా చూడాలి..
గార్ల: మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను మంగళవారం రాష్ట్ర ఎన్ని కల అబ్జర్వర్ మధుకర్‌బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ తీరుతెన్నులను సంబంధిత ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లు భద్రపరిచిన గదిని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ మంగమ్మ, తహసీల్దార్ శారద, సీనియర్ అసిస్టెంట్ శ్రీరామ్, పంచాయతీ కార్యదర్శి రమేశ్ ఉన్నారు.
ప్రశాంతంగా నిర్వహించాలి
నర్సింహులపేట: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు జి.మధుకర్‌బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని ముంగిమడుగు, రామన్నగూడెం, నర్సింహులపేట గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ సెంటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంపీఓ, సిబ్బంది పాల్గొన్నారు.


