శబరిమలకు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం శబరిమలకు వెళ్లేందుకు కాజీపేట, వరంగల్ మీదుగా ఆరు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు.
రైళ్ల వివరాలు..
డిసెంబర్ 13వ తేదీన సిర్పూర్‌కాగజ్‌నగర్–కొల్లం జంక్షన్ (07117) ట్రైన్ వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 20వ తేదీల్లో చర్లపల్లి–కొల్లం జంక్షన్ (07121) ట్రైన్ వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 24వ తేదీన హజూర్ సాహిబ్ నాందేడ్ –కొల్లం జంక్షన్ (07123) ట్రైన్ వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 15వ తేదీన కొల్లం జంక్షన్–చర్లపల్లి (07118) ట్రైన్ వరంగల్, కాజీపేటకు చురుకుని వెళ్తుంది. డిసెంబర్ 22వ తేదీన కొల్లం జంక్షన్–చర్లపల్లి (07122) ట్రైన్ వరంగల్, కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 26వ తేదీన కొల్లంజంక్షన్–చర్లపల్లి (07124) ట్రైన్ వరంగల్, కాజీపేటకు చేరుకుని వెళ్తుంది.
కాళేశ్వరం మాస్టర్ ప్లాన్‌కు డ్రోన్‌తో సర్వే
కాళేశ్వరం: వచ్చే ఏడాది జూలై చివరన జరగనున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరినది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన క్షేత్ర కన్సల్టెన్సీ ఆర్కిటెక్చర్ల ఆధ్వర్యంలో మంగళవారం కాళేశ్వరం మాస్టర్ ప్లాన్‌పై డ్రోన్ కెమెరాతో సర్వే చేపట్టారు. వివిధ రహదారులు, పురాతన ఆలయాలు, వీఐపీ, మెయిన్‌ఘాట్ల నుంచి అంతర్రాష్ట్ర వంతెన వరకు సర్వే చేపట్టారు. ముఖ్యంగా మరుగునపడిన ఆలయాలన్నింటినీ పునరుద్ధరణ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తె లిసింది. దీంతో కాళేశ్వరం అభివృద్ధికి నిధులు మంజూరై పాలన అనుమతులు రావడమే ఆలస్యమని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆత్మవిశ్వాసం చాటిన యాసిడ్ బాధితురాలు
● వైద్యసిబ్బంది, పోలీసుల సహకారంతో పరీక్షకు హాజరు
ఎంజీఎం : కాజీపేట మండలం కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం యాసిడ్ దాడిలో గాయాలపాలై ఎంజీఎంలో చికిత్స పొందుతున్న నర్సింగ్ విద్యార్థిని సునంద తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంది. సదరు నర్సింగ్ విద్యార్థిని వైద్యసిబ్బంది, పోలీసులు సహకారంతో మంగళవారం నిర్వహించిన నర్సింగ్ పరీక్షకు హాజరైంది. పరీక్షకు హాజరయ్యేందుకు ఎంజీఎం సూపరింటెండెంట్ అనుమతి కోరడంతోపాటు పోలీసులను సంప్రదించింది. ఈ క్రమంలో పోలీసులు, వైద్యసిబ్బంది పర్యవేక్షణలో పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతిచ్చారు. కేఎంసీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి వైద్యసిబ్బంది పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
విచారణ వేగవంతం..
కాజీపేట అర్బన్: నర్సింగ్ విద్యార్థిని సునందపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేసినట్లు మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ తెలిపారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంతోపాటు కాజీపేట, కడిపికొండ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
శబరిమలకు ప్రత్యేక రైళ్లు


