సంక్షేమంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): ప్రజల ఆరోగ్యం, సంక్షేమంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలు 12వ వార్డు పరిధిలోని వడ్డగేరి, బాపూజీ నగర్‌లో బుధవారం ఇళ్ల వద్దకు, వ్యాపారుల వద్దకు వెళ్లారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ విధానాలను వివరించారు. స్థానికుల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రభుత్వ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభు త్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేంద్రం నుంచి అనుమతి తీసుకొని రూ.8,500 కోట్లు ఖర్చు చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే చంద్రబాబు ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రైవేటుకు ఇచ్చేందుకు ఎన్నో కుట్రలు చేస్తోందన్నారు. వివిధ దశల్లో ఉన్న 12 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఐదేళ్ల వ్యవధిలో రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ. కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి దక్కుతాయన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఆస్తులను కొట్టేసేందుకు ప్రైవేటుకు అప్పగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, మధ్య తరగతి ప్రజలు, మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ఎంత వరకై నా పోరాటం చేస్తుందన్నారు. పార్టీ నాయకులు షరీఫ్, నవీన్, వన్నేష్, కార్పొరేటర్ రాజేశ్వర రెడ్డి, తిమ్మారెడ్డి ,కిషన్, పత్తాబాషా, కంటూ, ప్రకాష్, విల్సన్, వైఎస్సార్సీసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


