టీడీపీ నాయకుడి దౌర్జన్యం
ఆలూరు రూరల్/హాలహర్వి: కస్తూర్బా గాంధీ పాఠశాలలో తన వర్గానికి చెందిన మహిళకే వాచ్‌మెన్ పోస్టు ఇవ్వాలని టీడీపీ నాయకుడు మారుతి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. కేజీబీవీ ప్రినిపాల్‌పై దాడికి యత్నించారు. ప్రినిపాల్ తెలిపిన వివరాలు.. గత మూడు నెలల క్రితం పనిచేస్తున్న వాచ్‌మెన్ గౌరమ్మ రిటైర్డ్ అయ్యింది. ఆ పోస్టును తాము చెప్పిన వారికే ఇవ్వాలని టీడీపీ నాయకుడు మారుతి గత 15 రోజులుగా బెదిరిస్తున్నాడు. వాచ్‌మెన్ పోస్టు నియామకం పై ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లామని వారి ఉత్తర్వుల మేరకు నియామకం చేపడతామని ప్రిన్సిపాల్ చెప్పారు. బుధవారం రాత్రి కేజీబీవీ పాఠశాలలో చొరబడిన టీడీపీ నాయకుడు మారుతి తాము చెప్పిన వారికే వాచ్‌మెన్ పోస్టు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేసి ప్రిన్సిపాల్‌పై దాడికి యత్నించారు. అతని అరాచకపర్వాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తుండగా సెల్‌ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బాలికల పాఠశాలలో చొరబడి టీడీపీ నాయకుడు మారుతి భయభ్రాంతులకు గురిచేసినట్లు హాలహర్వి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపాల్ చెప్పారు.
కస్తూర్బా ప్రిన్సిపాల్‌పై దాడికి యత్నం
వాచ్‌మెన్ పోస్టు తమ వారికే
ఇవ్వాలంటూ బెదిరింపు
పోలీసులకు ఫిర్యాదు చేసిన
ప్రిన్సిపాల్ పద్మావతి


