ఉద్యోగాల పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో మోసం

Jul 8 2025 5:20 AM | Updated on Jul 8 2025 5:20 AM

ఉద్యోగాల పేరుతో మోసం

ఉద్యోగాల పేరుతో మోసం

కర్నూలు: కర్నూలులోని ఒక పాఠశాలలో టీచర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన లక్ష్మయ్య రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు తిలక్‌ నగర్‌కు చెందిన యువరాజు, బెంగళూరు ఇన్ఫో టెక్నాలజీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అనంతపురానికి చెందిన బాబు రూ.2 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు ముజఫర్‌ నగర్‌కు చెందిన అభిలాష్‌ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పక్కనున్న క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 85 ఫిర్యాదులు రగా చట్ట పరిధిలో విచారించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌ పీరా పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..

● నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్‌తో ఆస్తి మొత్తాన్ని కాజేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాలని కర్నూలు కుమ్మరి వీధికి చెందిన రాకేష్‌ ఫిర్యాదు చేశారు.

● నంద్యాల ఆటో నగర్‌కు చెందిన కురువ ఈరన్న ధరణి ఆటో గ్యారేజీలో పనిచేస్తూ ట్రాక్టర్‌ ఇంజిన్‌కు నెలకు రూ.20 వేలు బాడుగ ఇస్తానని తీసుకెళ్లి 8 నెలలు అయిందని, ఎక్కడికి వెళ్లిపోయాడో ఇంతవరకు తెలియడం లేదని, ఫైనాన్స్‌ ఆఫీస్‌ వారు కంతులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా ఆదోని మండలం ఇస్వి గ్రామానికి చెందిన రామాంజనేయులు, మల్లప్ప ఫిర్యాదు చేశారు.

● ఎకరా 20 సెంట్ల తన పొలాన్ని సర్వేయర్‌ కొలతలు వేసినా కూడా ఉగాది జయన్న అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ప్యాలకుర్తికి చెందిన పెరుగు నగేష్‌ ఫిర్యాదు చేశారు.

● కర్నూలు వడ్డెగేరికి చెందిన ఖాజా ఖాన్‌ గ్లాస్‌ వర్క్‌ పనిచేస్తున్నాడని, ఇన్‌స్ట్రాగామ్‌లో తన భర్త పేరుతో నకిలీ ఐడీ సృష్టించి ప్రముఖులను దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ విషయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కర్నూలుకు చెందిన ఫసియా ఫిర్యాదు చేశారు.

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు

పీజీఆర్‌ఎస్‌కు 85 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement