
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– లింగాల ఆర్‌అండ్‌బీ రహదారిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. మండలంలోని బిజనవేములకు చెందిన ప్రసాదు సొంత పనుల నిమిత్తం కోవెలకుంట్లకు వెళ్లాడు. తిరిగి బైక్‌పై ఇంటికి వెళుతుండగా గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రసాదుకు స్థానికులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు రెఫర్ చేశారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
న్యాయం చేయండి సారూ..
డోన్ రూరల్: టీడీపీ నాయకుల నుంచ తమ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడి న్యాయం చేయాలని ఎద్దుపెంట గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ అధికారులను వేడుకుంటున్నాడు. తన తండ్రి డి.ప్రసాద్ పేరుతో ఇంటి ముందు 1సెంట్ ఖాళీ స్థలం ఉందని విజయ్‌కుమార్ తెలిపారు. ఆ స్థలాన్ని పక్కనే ఉన్న టీడీపీ నాయకులు కేబీసీ డీలర్ పెద్దన్న, మాజీ సర్పంచ్ బి.ఈశ్వరయ్య, కేబీసీ మల్లేశ్వరయ్య ఆ ఆక్రమించడానికి యత్నిస్తున్నారన్నారు. పోలీసులకు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్లానన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్చు ఇచ్చినా టీడీపీ నాయకులు దౌర్జన్యంగా రచ్చకట్టపేరుతో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు