
గతంలో ఇలాంటి
పథకాలు లేవు
ముప్ఫై ఏళ్లుగా భర్త ఈరన్నతో పాటు ల్యాండ్రీ షాపు నడుపుతున్నా. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ల్యాండ్రీ మాకు జీవనాధారం. గతంలో మాకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందేవి కాదు. సీఎం జగన్ వచ్చాక వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏటా రూ.2300 చొప్పున నాలుగేళ్లపాటు ఇచ్చారు. నేను నవీన్ పొదుపు సంఘంలో సభ్యురాలిని. ఈ సంఘం ద్వారా బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణంతో పాటు సున్నా వడ్డీతో వచ్చిన మొత్తంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. పొదుపు సంఘాలకు జగనన్న బలోపేతం చేస్తున్నారు. మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలి. – చాకలి గోవిందమ్మ,
ఇందిరానగర్, ఆదోని పట్టణం
ఆరోగ్యశ్రీతో ఉపశమనం
కొన్నేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతుండేవాడిని. పేద కుటుంబం కావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో డబ్బు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేకపోవడంతో భరిస్తూ వచ్చాను. రోజురోజుకూ భరించలేని నొప్పి వస్తుండటంతో 2021లో కర్నూలులోని గౌరీగోపాల్ ఆస్పత్రిలో చేరాను. అయితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను. ఎలాంటి నొప్పులు లేవు. ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం నొప్పుల నుంచి ఉపశమనం కలిగించింది. అందుకే ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. – గోవిందు, వెలమకూరు,
దేవనకొండ మండలం

