స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తం
మచిలీపట్నంఅర్బన్: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తత చర్యలను వేగవంతం చేశా మని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.యుగంధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్, డిసెంబర్ మధ్య జిల్లాలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవ సాయ పనులు చేసే వారు ఈ వ్యాధి బారిన పడుతు న్నారని తెలిపారు. ఒరియెంటియా సుట్సుగముషి బాక్టీరియా, చిగర్ మైట్ కాటుతో ఈ వ్యాధి సోకు తుందని, అధిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కాటు దగ్గర నల్లటి పూత (ఎస్కార్) ముఖ్య లక్షణా లని వివరించారు. అనుమానిత రోగులకు వెంటనే యాంటీబయాటిక్ చికిత్స ప్రారంభించేందుకు మార్గదర్శకాలు జారీ చేశామని, మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంట పొలాల్లో పనిచేసేవారు శరీరాన్ని పూర్తిగా కప్పేసేలా దుస్తులు, బూట్లు ధరించాలని, పురుగు కాటు నివారణ రిపెలెంట్లు, దోమ తెరలు వాడాలని సూచించారు. మూడు రోజులకు మించి జ్వరం ఉన్నా ఎస్కార్ కనిపించినా వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రిని సంప్రదించాలని డాక్టర్ యుగంధర్ స్పష్టం చేశారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ యుగంధర్


