
కనిపించని పలు ఎం బుక్‌లు, బిల్లుల ఫైళ్లు
ఎంఎంసీలోని అకౌంట్స్ విభాగంలో కొన్ని సంవత్సరాలకు సంబంధించిన పనుల ఎం బుక్‌లు, బిల్లుల ఫైళ్లు కనిపించడం లేదు. తమ బిల్లులు ఎప్పుడు చేస్తారంటూ వెళ్తున్న కాంట్రాక్టర్లకు ఆ ఫైళ్లు కనిపించటంలేదనే సమాధానం వినిపించడంతో వారు ఆందో ళనకు గురవుతున్నారు. ఇటీవల ఓ కాంట్రాక్టర్ ఈ విషయమై ఫిర్యాదు చేయటంతో ఇన్‌చార్జ్ ఏఓ వెతకగా కొన్ని ఫైళ్లే దొరికాయని చెబుతున్నట్లు తెలిసింది. ఇంకా చాలా ఫైళ్లు మాయమయినట్లు సమాచారం. ఈ విషయంపై కాంట్రాక్టర్లు లింగం రవికిరణ్, ఎడమా నరేంద్ర ఇటీవల మునిసిపల్ కమిషనర్ బాపిరాజును కలసి తమ గోడును వినిపించారు.