
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025
ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రాజ్ ప్రియాసింగ్ నేతృత్వంలోని బృందం మంగళవారం పరిశీలించింది. తొలుత రేమల్లె గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు పండ్లతోటల సాగు, బంద్రీ చెరువు పూడికతీత, పశువుల షెడ్ల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ చానల్ పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మామిడి మొక్కలు పెంచుతున్న రైతు సంగీతరావుతో మాట్లాడారు. సాగు వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మడిచర్ల గ్రామంలో పంట కుంట, బీటీ రోడ్డు, రజక చెరువులో పూడిక తీత, పశువుల షెడ్డు నిర్మాణం, మ్యూజిక్ సోక్ పిట్ పనులను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. పీఎంఏవై–జీ పథకం కింద గ్రామంలో చేపట్టిన గృహ నిర్మాణాలను సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద కానుమోలు నుంచి రంగయ్య అప్పారావు పేట, రామ శేషాపురం గ్రామాల మీదగా రామన్నగూడెం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ సీఈఓ కన్నమ్మ నాయుడు, డ్వామా పీడీ శివ ప్రసాద్ యాదవ్, డీఆర్‌డీఏ పీడీ హరహరినాథ్, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాసరావు, ఎంపీడీఓ జోగేశ్వరరావు, ఏపీఓ అశోక్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు, పలువురు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
అవనిగడ్డ: ఖరీఫ్ సాగు ఆరంభంలోనే కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతోంది. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 40 శాతానికి పైగా విత్తనాలను రైతులకు వారి గ్రామాల్లోనే అందించి ఆదుకుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పదిశాతం విత్తనాలు మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకొంది. దీంతో కృష్ణాజిల్లా రైతులు వరి వంగడాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
అరకొరగా విత్తనాలు
కృష్ణాజిల్లాలో ఈ ఖరీఫ్‌లో 1.64 లక్షల హెక్టార్లలో రైతులు వరిసాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ఎక్కువగా ఎంటీయూ 1061, బీపీజీ 5204 రకాలను రైతులు సాగుచేస్తారు. గత సంవత్సరం ఎంటీయూ 1262, 1318 రకాలను పలుచోట్ల సాగుచేయగా వాటిని కొనేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. దీంతో ఈ సంవత్సరం రైతులు ఆ రకాల జోలికెళ్లడం లేదు. సాధారణంగా ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనాలను రైతులు నారుమడికి ఉపయోగిస్తారు. ఈ సీజన్‌లో 1.02 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవగా ప్రభుత్వం 10,650 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకొంది. దీంతో విత్తనాలు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వచ్చిన లోడులు వచ్చినట్టు అయిపోతున్నాయి. రైతులు పనులు మానుకుని గంటల తరబడి ఎదురు చూసినా కొన్ని చోట్ల విత్తనాలు దొరకడం గగనంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 40 నుంచి 45 శాతం విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేసింది. అవసరమైతే డిమాండ్‌ను బట్టి మరో ఐదు శాతం విత్తనాలు సరఫరా చేసింది. ఈ ప్రభుత్వం పదిశాతం మాత్రమే సరఫరా చేయడంతో రైతులు విత్తనాలు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం కూడా విత్తనాల కోసం రైతులకు ఇబ్బందులు తప్పలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయిందని రైతులు తమకు తామే సర్దిచెప్పుకొన్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కొనసాగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం సబ్సిడీపై అవసరమైనన్ని వరివిత్తనాలు సరఫరా చేసింది. ఇప్పుడు చాలా తక్కువ వచ్చాయని చెబుతున్నారు. బయట షాపుల్లో రేటు ఎక్కువ. కల్తీ విత్తనాలు వచ్చే ప్రమాదముంది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాల సరఫరా పెంచాలి.
– చిరివేళ్లే యానాదిరావు, పిట్టల్లంక
కృష్ణాజిల్లాలోని బందరు, కేఈబీ కెనాల్‌కు ఇటీవల సాగునీరు విడుదల చేశారు. గతంలో బోర్ల కింద అక్కడక్కడా రైతులు నారుమళ్లు పోసుకున్నారు. పంట కాలువలకు సాగునీరు విడుదల చేయడంతో ఇప్పుడే నారుమళ్లు పోసుకునే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఆదిలోనే విత్తనాలకు ఈ విధంగా డిమాండ్ ఉంటే సాగు పనులు ముమ్మరం చేస్తే పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 65 శాతం మంది కౌలు రైతులు ఉన్నారు. ఏటా పంట చేతికందగానే 85 శాతం మంది కౌలు రైతులు విత్తనాలకు తీయకుండానే ధాన్యం విక్రయిస్తారు. వీరంతా ప్రస్తుతం ఎక్కడో ఒకచోట విత్తనాలు కొనుగోలు చేసి సాగుచేయాల్సిందే. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి సాగుకు సరిపడా విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
రైతులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. గత సంవత్సరం సబ్సిడీ విత్తనాలు సరిగా సరఫరా చేయలేదు. ఈ సంవత్సరం అదే ధోరణి అవలంబిస్తోంది. ప్రైవేటు షాపుల్లో విత్తనాలు తెచ్చుకోవడానికి వెళ్లిన రైతులు బాగోలేవని తిరిగి వచ్చేస్తున్నారు.
– బీసాబత్తిన ప్రసాద్,
మాజీ డీసీ చైర్మన్, నాగాయలంక
అవనిగడ్డ సబ్ డివిజన్‌కు బీపీటీ 5204 రకం 515 క్వింటాళ్లు, ఎంటీయూ 1061 రకం 154 క్వింటాళ్లు, 1318 రకం 110 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి. ప్రస్తుతం వీటిని రైతులుకు సబ్సిడీపై అందిస్తున్నాం. ప్రైవేటు విత్తన షాపులను తనిఖీ చేస్తున్నాం. ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.
– జయప్రద, ఏడీఏ, అవనిగడ్డ
9
న్యూస్‌రీల్
సరిపడా విత్తనాలు ఇవ్వాలి
కృష్ణా జిల్లాలో 1.64 లక్షల హెక్టార్లలో వరిసాగు 1.02 లక్షల క్వింటాళ్ల వరి వంగడాలు అవసరం ప్రభుత్వం సరఫరా చేసింది 11,650 క్వింటాళ్లే.. విత్తనాల కోసం రైతులకు తప్పని ఇబ్బందులు గత ప్రభుత్వంలో 40 శాతానికి పైగా విత్తనాల పంపిణీ అవసరమైతే ఇండెంట్ పెట్టి సరఫరా చేసిన వైనం
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
ఇప్పుడే ఇలా ఉంటే..
తనిఖీలు చేస్తున్నాం

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా