
పొందూరు అంజన్
సాక్షి ప్రతినిఽధి, విజయవాడ: రోజురోజుకూ కొడిగడు తున్న టీడీపీ ఉనికి కాపాడేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు తెగిస్తున్నారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేవారికి నిస్సిగ్గుగా మద్దతిస్తున్నారు. సామాజికవర్గ విద్వేషాలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్రలు పన్నుతున్న అసాంఘిక శక్తులకు టీడీపీ జెండా నీడన రక్షణ కల్పిస్తున్నారు. గన్నవరానికి చెందిన అంజన్(అంజన్ చౌదరి)కి చంద్రబాబు, లోకేష్ మద్దతుగా నిలబడటమే అందుకు తాజా నిదర్శనం.
అంజన్ తీరు వివాదాస్పదం
గన్నవరం రామానగర్ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల పొందూరు అంజన్ అలియాస్ అంజన్ చౌదరి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అంజన్ యువగళం ఖాతాలో మహిళలను కించరుస్తూ, అసభ్యకర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. విద్వేషకర పోస్టులు పెట్టడంతోపాటు సంఘ వ్యతిరేక, జుగుప్సాకర కార్యక్రమాల్లో పాల్గొంటూ కొన్నేళ్లుగా వివాదాలకు కీలకమవుతున్నాడు. అతని పేరు చెబితేచాలు కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా హడలిపోతారు. 2015లో ఆమెరికాలో ఉద్యోగాన్ని వదిలి గన్నవరం వచ్చినప్పటి నుంచి ఆయన వ్యవహర శైలి అంతే. మత్తు పదార్థాలకు బానిసగా మారిన అతను కుటుంబసభ్యులతో పాటు ఎంతో మందిపై ఎన్నోసార్లు దాడులకు తెగబడ్డాడు. అతని తీరుతో విసిగిపోయిన కుటుంబ సభ్యులే రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నువ్వే కావాలి
అంజన్ గురించి తెలుసుకున్న టీడీపీ సోషల్ మీడియా విభాగం అతడిని తమ జట్టులో చేర్చుకొంది. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసే, మహిళలను కించపరిచేలా పోస్టులను వైరల్ చేసే వ్యవహారానికి సంబంధించి ఐటీడీపీలో అంజన్ కీలకంగా మారాడు. తొలుత వ్యక్తిగతంగా విద్వేష పూరిత పోస్టులు పెట్టే అంజన్‌కు టీడీపీ అండ లభించడంతో మరింతగా రెచ్చిపోయాడు. అతని బాధితులు ఎంతో మంది, ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో అంజన్ సోషల్ మీడియా పోస్టింగులపై పోలీసులు దృష్టిసారించారు. అతని పోస్టులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని పోలీసులు నిర్ధారించారు. పూర్తి ఆధారాలతో అదుపులోకి తీసుకొని గన్నవరం కోర్టులో హాజరుపరిచారు.
నువ్వే మా హీరో...
‘మీరు నా దృష్టిలో రియల్ హీరో. పసుపు జెండా కోసం త్యాగాలు చేస్తున్న మీరు నా మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించుకొన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా’.. అంటూ అంజన్‌ను ఉద్దే శించి సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ పోస్టు చేయడం గమనార్హం. అంజన్‌ను వెంటనే విడుదల చేయాలని, అతడిని అరెస్టు చేసిన పోలీసు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సైతం డిమాండ్ చేశారు.
విద్వేషకర పోస్టులతో విషం చిమ్ముతున్న ఐటీడీపీ ఐటీడీపీ కుట్రలో పాత్రధారి అంజన్ మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో వికృత పోస్టింగ్‌లు పూర్తి ఆధారాలతో అంజన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అయినా నిందితుడికి చంద్రబాబు, లోకేష్ వత్తాసు
ఫోన్ నిండా గే వీడియోలు
అంజన్ వద్ద నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్, ట్యాబ్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు జప్తు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. అతని ఫోన్, ట్యాబ్‌లో వందల కొద్దీ గే (స్వలింగ సంపర్కం) వీడియోలను చూసి పోలీసులు విస్తుపోయారు. జుగుప్సాకర వ్యాఖ్యలతో కూడిన వేల పేజీల చాటింగ్‌లు ఉన్నాయి. టిండర్ క్రెడిట్, క్యూపిడ్, గ్రిండర్, క్లబ్ హౌస్ తదితర డేటింగ్ యాప్‌ల ద్వారా గుంటూరు, విజయవాడకు చెందిన పలువురు స్వలింగ సంపర్కులతో సంబంధాలు పెట్టు కున్నాడు. వారితో నగ్న వీడియో కాల్స్, అసంబద్ధ లైంగిక సంబంధాలకు అలవాటు పడ్డాడు. వ్యసనాలకు డబ్బుల కోసం తల్లిదండ్రులు, స్నేహితులను హింసించటమేకాక ప్రముఖులకు పరువు నష్టం కలిగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నందున పోలీసు అదుపులోకి తీసుకొని న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ కేసు సైబర్ నిపుణుల ఆధ్వర్యంలో విచారణలో ఉంది. అంజన్‌పై సైబర్ బుల్లీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.
పక్కా ఆధారాలతోనే..
అంజన్ యువగళం పేరుతో సోషల్ మీడి యాలో అంజన్ విద్వేష కర పోస్టింగులు పెడుతున్నారు. సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా, ప్రముఖ వ్యక్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయి. సైబర్ నిపుణులతో విచారణ చేయిస్తున్నాం. టీడీపీ సోషల్ మీడియాతో చాటింగ్‌లుకూడా ఉన్నాయి. అసహజ లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారు. అతనిపై నిఘా పెట్టి సైబర్ బుల్లీషీట్ ఓపెన్ చేశాం.
– పి.జాషువా, కృష్ణా జిల్లా ఎస్పీ
