
కళాశాలల్లో వసతుల కల్పనకు చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం డీఐఈవో కళ్యాణితో కలిసి ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పనకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, మూత్రశాలలు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, ఫర్నీచర్‌తోపాటు ఇతర మరమ్మతుల కోసం జాబితా సిద్ధం చేయాలని సూచించారు.