
ఆదర్శనీయుడు కుమురం భీం
కౌటాల(సిర్పూర్): పోరాటయోధుడు కుమురం భీం అందరికీ ఆదర్శవంతుడని ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే కోవ లక్ష్మి అన్నారు. కౌటాల మండలం జనగాం గ్రామంలో ఆదివారం కుమురం భీం నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల సాధనకు భీం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్లు సిడాం గణపతి, కోనేరు కృష్ణారావు, సహకార సంఘం చైర్మన్ కె.మాంతయ్య, నాయకులు మధుకర్, శ్రీవర్థన్, బండు, సంతోష్, హన్మంతు, పోశం, నాహీం తదితరులు పాల్గొన్నారు.